నువ్వు అక్కడ నేనిక్కడ
కాలం ఎందుకు ఇలా నిన్ను
నన్ను విడదీస్తోందో......తెలియదు
కాని....
కలల్లో నీవే.....
కళ్ళల్లో నీవే....
ఊహల్లో నీవే....
ఊపిరిలో నీవే.....
భాషలో నీవే.....
భావంలో నీవే.....
మనసున నీవే....
మౌనంలో నీవే.....
ప్రాణంలో నీవే.....
ప్రతి అణువణువునా
నీవే.....
నిను చూడని రోజు.....
ఆ రోజు నీస్సారమై
పోతుంది....
నీ మాట వినిపించని
క్షణం.....
ఈ ఊపిరి ఆగిపోతుందేమో
అనిపిస్తుంది......
గడచిన కాలం... అంతా...కలలా
కదిలి పోతుంటే...
ఇక ముందున్న కాలం
అంతా...క్షణమైనా.. ఓక్క క్షణమైనా...
నీ చేతిని విడవకుండా.......
నీపై చూపు మరల్చకుండా.....
నీ అడుగులో అడుగేస్తూ
నీ తోడునై .. నిన్ను నా
తోడుని చేసుకొని...... ఒకరి
కోసం ఒకరై ... మిగిలిన కాలం
అంతా గడపాలని...మనసు పరుగులు
తీస్తోంది....