Telugu Kavithalu

Home | Priyamina Neeku | neekosam ee hrudayam | Snehitudu | Kanulu Musina | Nuvvu Ikkada Nenu ikkada | Nikosam | Aa ningi | Vediki chudu | Priya Nestam | Virabusina | Na Priya Nestam | Naa Bhavam | Vennela | Nuvvu Nenu
Priyamina Neeku

Enter subhead content here

ప్రియమైన నీకు

ఇక్కడ నీవు లేవు కాని...ఈ గది లోని

ప్రతి అణువు ని ఉనికినే గుర్తుకు తెస్తున్నాయి.

చల్లగా నను స్పృశించిపోయే చిరుగాలి

ఎక్కడ నీ ప్రియనేస్తం అని అడుగుతుంది.

వాకిట్లో పూసిన సన్నజాజులు నీకోసమే ఎదురుచూస్తున్నట్లున్నాయి.

యదనిండా నీ తియ్యని జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి

ఎపుడెపుడు నిను చూస్తానా అని మనసు మారాం చేస్తుంది.

ఆకాశం లోని నక్షత్రాలు నీ కళ్ళలో కనిపించే కాంతి రేఖలై

నికు నాకు మధ్య పెనవేసుకున్న

ఈ ప్రేమ బంధాన్ని కాంతివంతం చేస్తున్నాయి.

మనం కలిసి నడిచే బాటలోని పూలు

మన ప్రేమకి శుభాకాంక్షలు చెబుతుంటే

నీ చేతిలో నా చెయ్యి నీ అడుగులో నా అడుగు

ఒకరిమీద ఒకురు పెంచుకున్న ప్రేమ, అభిమానం

ఇద్దరిదీ ఒకే మాట ఒకటే ప్రాణం

నికు బాధ కలిగితే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.

నేను దిగులుగా వుంటే నీ మనసుకు బాధ కలుగుతుంది.

ఈ బంధం ఇలాగే కలకాలం నిలిచిపోవాలని....

నీలో సగభాగంగా నేను మిగిలి పోవాలి అని

నీకోసం నేను నాకోసం నువ్వు

మనకోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని

మనం ఆశించిన ఉన్నత స్ధాయి కి ఎదగాలి అని

మనస్తూర్తిగా కోరుకుంటున్న....

Enter supporting content here